: హిందూపురంలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం
అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ స్థానానికి తెలుగుదేశం అభ్యర్ధిగా నిన్న నామినేషన్ వేసిన సినీ హీరో బాలకృష్ణ హిందూపురం పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఆయన ఓటర్లను అభ్యర్ధించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు ఆయన వెంట ప్రచారంలో పాల్గొన్నారు.