: బాలయ్య ఆస్తి 170 కోట్లు
సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ ఆస్తి అక్షరాలా 170 కోట్ల రూపాయలు. హిందూపురంలో నామినేషన్ వేసిన సందర్భంగా బాలయ్య తన ఆస్తి వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు. తను, తన భార్య, తన ఇద్దరు కుమార్తెల పేరిట ఉన్న ఆస్తి మొత్తం 170 కోట్ల రూపాయలుగా బాలయ్య స్పష్టం చేశారు. అనంతరం ఆయన హిందూపురంలో ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్ ది అవినీతి వాదమైతే, వైఎస్సార్సీపీది అరాచకవాదమని అన్నారు. టీడీపీది అభివృద్ధి వాదమని ఆయన తెలిపారు.