: రాహుల్ గాంధీ ప్రత్యర్థి స్మృతీ ఇరానీ నామినేషన్
బీజేపీ నేత స్మృతీ ఇరానీ అమేథీ లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా, ఆమ్ ఆద్మీ తరపున కుమార్ విశ్వాస్ పోటీ పడుతున్నారు. దీంతో అమేధీలో త్రిముఖపోటీ నెలకొంది. నామినేషన్ వేసిన సందర్భంగా స్మృతీ ఇరానీ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం అంటే కుటుంబపాలన కాదని విమర్శించారు. తనకు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, కాంగ్రెస్ బీ పార్టీ కాదని ఆమె అభిప్రాయపడ్డారు.