: తెలంగాణలో 75 స్థానాలు మావే: డీఎస్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే విజయమని ఆ పార్టీ సీనియర్ నేత డి శ్రీనివాస్ తెలిపారు. నిజామాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో 75 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని అన్నారు. తనపై విమర్శలు గుప్పించిన కేసీఆర్ రాజకీయంగా ఆరితేరారని కితాబిచ్చారు. అయితే ఆయనకు పరిపాలించేంత స్థాయి రాలేదని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దొరలపాలన వస్తుందని అన్నారు. మాట తప్పకపోవడమే అజ్ఞానం అయితే కాంగ్రెస్ పార్టీ నేతలంతా అజ్ఞానులేనని ఆయన అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.