: హిందూపురం లోక్ సభ స్థానానికి నిమ్మల నామినేషన్


టీడీపీ నేత నిమ్మల కిష్టప్ప అనంతపురం జిల్లాలోని హిందూపురం లోక్ సభ స్థానానికి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. అనుచరులు, పార్టీ శ్రేణులతో తరలి వచ్చి జిల్లా కలెక్టర్ కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. హిందూపురం శాసనసభ స్థానానికి బాలయ్య పోటీ పడుతున్న విషయం తెలిసిందే. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 19వ తేదీతో గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ వేగం పుంజుకుంది.

  • Loading...

More Telugu News