: మునిగిపోయిన నౌక... 390 మంది గల్లంతు
239 మందితో విమానం అదృశ్యమైపోయిన విషాదం మర్చిపోకముందే... ఓ నౌక నిన్న అర్ధరాత్రి ప్రమాదవశాత్తూ దక్షిణ కొరియా తీర సముద్రంలో మునిగిపోయింది. ఇందులో 470 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది విద్యార్థులేనని సమాచారం. దక్షిణ కొరియా తీర రక్షక దళం 180 మందిని రక్షించింది. సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకోవాలని ప్రయాణికులకు సిబ్బంది సూచించినట్లు సమాచారం. మిగిలిన వారిని కాపాడేందుకు నేవీ, తీర రక్షక దళానికి చెందిన 34 నౌకలు, 18 హెలికాప్టర్లు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్ గ్యూన్ హై ఆదేశించారు.