: నేడు హిందూపురం స్థానానికి నామినేషన్ వేయనున్న బాలకృష్ణ
అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ స్థానానికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు తనయుడు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. తొలుత హిందూపురం సుగూర ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించనున్నారు. అనంతరం భారీ ర్యాలీతో వెళ్లి ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.