: బొమ్మనుకుని నిజం తుపాకీతో కాల్చిన బాలుడు


అమెరికాలో తుపాకీ సంస్కృతి విచ్చలవిడిగా రాజ్యమేలుతోంది. ఓ ఐదేళ్ల బాలుడి సరదా ఓ నిండు ప్రాణాన్ని తీసింది. సౌత్ కరోలినా రాష్ట్రంలో అందరూ బర్త్ డే పార్టీలో మునిగి తేలుతుండగా, పుట్టిన రోజు జరుపుకుంటున్న బాలుడు కారు బొమ్మ కోసం వెతికాడు, అతనికి కారు దొరకలేదు కానీ తన తల్లి బాయ్ ఫ్రెండ్ కు సంబంధించిన తుపాకీ దొరికింది. దురదృష్టవశాత్తు అది లోడ్ చేసి ఉంది. దానిని బొమ్మ అనుకున్న బాలుడు సరదాగా కాల్చాడు.

తుపాకీలోంచి దూసుకొచ్చిన బుల్లెట్లు ఏడేళ్ల బాలిక గుండెల్లోంచి దూసుకెళ్లగా, ఐదేళ్ల బాలుడిని తీవ్రంగా గాయపరిచాయి. దీంతో వారిని వెంటనే అసుపత్రికి తరలించగా బాలుడ్ని రక్షించగలిగిన వైద్యులు బాలికను కాపాడలేకపోయారు. బాలిక మృతితో బర్త్ డే పార్టీకి వచ్చిన అతిథులు విషాదంలో మునిగిపోయారు.

  • Loading...

More Telugu News