: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయం: చంద్రబాబు


కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో రోడ్ షో నిర్వహిస్తున్న చంద్రబాబు రాజమండ్రి సమీపంలోని గాదలలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయామని ప్రజలు బాధపడుతున్నారని, ఆ పార్టీ అడ్రసు గల్లంతయిందని చంద్రబాబు అన్నారు. తాను పెట్టిన దీపాన్ని కాంగ్రెస్ నాయకులు ఆర్పివేశారని చంద్రబాబు ఆరోపించారు. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని, నిర్భయ చట్టాన్ని తెచ్చినా ఎక్కడా అమలు కాలేదని ఆయన అన్నారు. నిరుద్యోగ భృతి రూ. 2 వేలు చెల్లిస్తామని, ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తామని చంద్రబాబు చెప్పారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇప్పిస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ దొంగలనే నమ్మితే రాష్ట్రాన్ని తెగనమ్ముతారని బాబు ఆరోపించారు.

  • Loading...

More Telugu News