: కాకినాడలో నామినేషన్ వేసిన తోట నర్సింహం
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి తోట నర్సింహం ఇవాళ నామినేషన్ వేశారు. కాకినాడ పార్లమెంటు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ నీతూ ప్రసాద్ కు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకు ముందు ఆయన స్వగ్రామం తెర్లంపూడి మండలం వీరవరం గ్రామం నుంచి భారీ ర్యాలీగా బయల్దేరి కాకినాడ చేరుకున్నారు. అనంతరం కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు.