: అనంతపురం జిల్లా గుత్తిలో జగన్ రోడ్ షో
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అనంతపురం జిల్లా గుత్తిలో ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుత్తిలో రోడ్ షోలో పాల్గొన్న జగన్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఖాళీ అవుతుందన్నారు. సబ్సిడీ బియ్యం రేటు పెంచిన ఘనత చంద్రబాబుదే అని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం తీసుకువస్తామని జగన్ హామీ ఇచ్చారు.