: ఫరాకు షారూఖ్ ఖరీదైన బహుమతి
బాలీవుడ్ బాద్షాకు మిత్రులను సంతోషంలో ముంచెత్తడం చాలా ప్రీతి. షారూఖ్ ఖరీదైన కానుకలతో సన్నిహితులను ఆనందాశ్చర్యాలకు గురి చేస్తుంటాడు. తాజాగా అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. షారూఖ్ కొత్త సినిమా 'హ్యాపీ న్యూ ఇయర్' సినిమా దర్శకురాలు ఫరాఖాన్ కు షారూఖ్ ఖాన్ ఖరీదైన కారు కానుకగా ఇచ్చారు. ఫరాఖాన్ 'నేను అందుకున్న బహుమతి ఏమిటో చూడండి' అంటూ కారుతో దిగిన ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేసి 'షారూఖ్ ఖాన్ కు ధన్యవాదాలు' అని పేర్కొంది.
గతంలో తమ కాంబినేషన్ లో వచ్చిన 'మై హూ నా', 'ఓం శాంతి ఓం' సినిమాలు విడుదలై సూపర్ హిట్లైన తరువాత కూడా ఆమెకు కార్లు కొనిచ్చాడు. 'హ్యాపీ న్యూ ఇయర్' సినిమా సెట్స్ మీద ఉండగానే షారూఖ్ కారు కొనివ్వడంతో ఆ సినిమా కూడా హిట్టవుతుందని బాలీవుడ్ జనాలు అంచనాలు వేసుకుంటున్నారు. 'హ్యాపీ న్యూ ఇయర్' సినిమాలో షారూఖ్ ఖాన్ తో పాటు అభిషేక్ బచ్చన్, దీపికా పదుకునే కూడా నటిస్తున్నారు.