: గాలి బెయిల్ పై అఫిడవిట్ వేయాలని సీబీఐకి సుప్రీం ఆదేశం
గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్ ఇవ్వకూడదంటూ వాదిస్తున్న సీబీఐను అఫిడవిట్ వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గాలికి బెయిల్ ఎందుకు ఇవ్వకూడదో తెలపాలని ప్రశ్నించింది. అనంతరం విచారణను మే 6కు కోర్టు వాయిదా వేసింది. గనుల కుంభకోణంలో అరెస్టయిన గాలి కొన్నేళ్లుగా రిమాండ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే.