: తెలంగాణకు వెన్నుపోటు పొడిచింది కేసీఆర్, బాబు: గుత్తా


తెలంగాణను మోసం చేసింది కేసీఆర్, చంద్రబాబునాయుడులేనని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో కేసీఆర్ సీట్లు అమ్ముకున్నాడని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టిన ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ టికెట్లిచ్చాడని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను విలీనం చేస్తామని కేసీఆర్, కేటీఆర్, హరీష్ లు మాటిచ్చారని ఆయన తెలిపారు.

ఇచ్చిన మాటకు కట్టబడి కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే, ఒప్పందానికి తూట్లు పొడిచి కేసీఆర్ ఎన్నికల్లో పోటీ పడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంస్థను సరిగా నడపని కేసీఆర్ తెలంగాణను ఎలా పునర్నిర్మిస్తారని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News