: సీమాంధ్రలో టికెట్లకోసం నేతలు పోటీ పడ్డారు: చిరంజీవి
రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు సీమాంధ్ర నేతలు అయిష్టత చూపుతున్నారన్నది వాస్తవం. అయితే సీమాంధ్రలో టికెట్లకోసం నేతల పోటీ పడ్డారని హైదరాబాదులోని ఇందిరాభవన్ లో మాట్లాడుతూ కేంద్రమంత్రి, పార్టీ ప్రచార సారథి చిరంజీవి అన్నారు. ఆ పోటీ చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పారు. సీమాంధ్రలో కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితుల్లో లేదని, తప్పకుండా పూర్వ వైభవం వస్తుందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ ఎంతో చేసిందన్నారు. రాష్ట్రం విడిపోకుండా ఉంటే పోలవరం ప్రాజెక్టును కేసీఆర్ రానిచ్చేవారు కాదన్నారు.