: 450 'నామా'లు పెడతాడు: సీపీఐ నారాయణ


ఇప్పటి వరకు ఖమ్మం పార్లమెంటు సభ్యునిగా ఉన్న నామా నాగేశ్వరరావు ప్రజలకు ఇప్పటికే మూడు పంగనామాలు పెట్టాడని, కార్పొరేట్ సంస్థల పేరుతో బ్యాంకులకు రూ. 450 కోట్లను ఎగ్గొట్టిన నామా, అదే సంఖ్యలో ప్రజలకు నామాలు పెడతాడని ఖమ్మం పార్లమెంటు నుంచి బరిలో దిగుతోన్న సీపీఐ అభ్యర్థి కె. నారాయణ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణ ఖమ్మం జిల్లా కుక్కునూరులో ప్రసంగించారు.

సీపీఐ, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ముంపు ప్రాంతాల సమస్యను అసెంబ్లీ, పార్లమెంటులో వినిపిస్తామని నారాయణ తెలిపారు. పోలవరం ముంపు భూములకు ఎకరాకు రూ. 10 లక్షలు ఆర్.ఆర్ ప్యాకేజీ కింద, నిర్వాసిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News