: యూఎస్ లోని భారత సంతతి రచయితకు పులిట్జర్ పురస్కారం
అమెరికాలోని భారత సంతతి రచయిత విజయ్ శేషాద్రికి 2014 ఏడాదికి గాను పులిట్జర్ అవార్డు దక్కింది. ఆయన రాసిన '3 సెక్షన్స్' పుస్తకం పొయెట్రీ విభాగంలో ఈ పురస్కారానికి ఎంపికైంది. ఈ మేరకు 98వ వార్షిక బహుమతుల ప్రకటనలో కొలంబియా విశ్వవిద్యాలయం శేషాద్రికి అవార్డును ప్రకటించింది. దీనికింద 10వేల యూఎస్ డాలర్లను ఆయనకు ఇవ్వనున్నారు. జర్నలిజం, లెటర్స్, డ్రామా, సంగీతం వంటి విభాగాల్లో ఈ అవార్డును ప్రతిఏటా ప్రకటిస్తారు. కాగా న్యూయార్క్ లోని లిబరల్ ఆర్ట్స్ కళాశాలలో ఉపాధ్యాయుడిగా పొయెట్రీ, నాన్ ఫిక్షన్ రచనలను శేషాద్రి బోధిస్తున్నారు. 1954లో బెంగళూరులో జన్మించిన శేషాద్రి... ఐదేళ్ల వయసున్నప్పుడే ఓహియోకు వచ్చారు. ఇక్కడే పెరిగి తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు.