: వైద్యుల నిర్లక్ష్యం... శిశువు మృతి
ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మరో శిశువు మృత్యువాత పడింది. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. గర్భిణికి సకాలంలో వైద్యం అందించకపోవడంతో శిశువు మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి నిరసనగా వారు ఆందోళనకు దిగారు.