: అమేధీలో ఈ నెల 16న నామినేషన్ వేయనున్న స్మృతి ఇరానీ
ఉత్తరప్రదేశ్ లోని అమేధీ లోక్ సభ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్న ప్రముఖ నటి స్మృతి ఇరానీ ఈ నెల 16వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అమేధీ సిట్టింగ్ ఎంపీ రాహుల్ గాంధీకి ప్రత్యర్థిగా నిలబడుతున్న ఇరానీ బుధవారం నాడు తొలుత అమేధీలోని ‘బుధన్ మై’ అమ్మవారిని దర్శించుకుని గౌరీగంజ్ లోని కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు బీజేపీ మీడియా ప్రతినిధి అశోక్ పటేల్ తెలిపారు.