: తెలుగువారిని రక్షించే బాధ్యత టీడీపీదే: చంద్రబాబు
కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గ్రేటర్ హైదరాబాదులోని మల్కాజిగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాబు పాల్గొని ప్రసంగించారు. తెలుగుజాతి ప్రయోజనాల కోసమే భారతీయ జనతాపార్టీతో పొత్తు పెట్టుకున్నామని ఆయన అన్నారు. నాయకులు టీడీపీకి ద్రోహం చేసినా కార్యకర్తలు పార్టీని కాపాడారన్న చంద్రబాబు... టీడీపీ కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. తెలుగువారిని రక్షించే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని ఆయన అన్నారు. పేదలు, మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నెరవేరుస్తామని ఆయన చెప్పారు. కేసీఆర్ ఆటలు సాగవన్న చంద్రబాబు అందరం కలిసి అవినీతితో యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు.