: స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
అంబేద్కర్ ఆశయాల సాధనలో అందరూ భాగస్వాములవ్వాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ అశ్విన్ మెహతా అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాదు ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎస్.బి.ఐ. జీఎంలు అశ్విన్ మెహతా, అజిత్ కుమార్ జైన్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన మిఠాయి, మజ్జిగ శిబిరాన్ని వారు ప్రారంభించారు. మహనీయుడైన అంబేద్కర్ ను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాన్ని ఎస్.బి.హెచ్ సీజీఎం ఘోష్ ప్రారంభించారు. నిరుపేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు ప్రజలకు మజ్జిగ, మిఠాయి పాకెట్లు పంపిణీతో పాటు అన్నదానం కూడా చేశారు.