: పవన్ ప్రచారానికి హెలికాప్టర్ సిద్ధం... రేపు సుడిగాలి పర్యటన


జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు సుడిగాలి పర్యటన చేయనున్నారు. కర్ణాటకలో బీజేపీ తరపున మూడు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఉదయం 9 నుంచి 11 వరకు రాయచూర్, మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు కోలార్, 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గురుమిడ్కల్ లో ప్రచారం చేయనున్నారు. పవన్ ప్రచారానికి సంబంధించిన ఏర్పాట్లను నరేంద్ర మోడీ కార్యాలయం సమన్వయం చేస్తోంది. అంతేకాకుండా, పవన్ పర్యటన కోసం ప్రత్యేక హెలికాప్టర్ ను ఏర్పాటు చేసింది. రేపు ఉదయం 7 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో పవన్ బయల్దేరుతారు.

  • Loading...

More Telugu News