: విజయవాడ లోక్ సభ అభ్యర్థిగా కేశినేని నాని ఖరారు?
విజయవాడ లోక్ సభ టీడీపీ అభ్యర్థిగా కేశినేని నాని పేరు ఖరారు కానుందని సమాచారం. ఈ విషయాన్ని కాసేపట్లో ప్రకటించనున్నారు. విజయవాడ స్థానానికి పొట్లూరి ప్రసాద్ పేరు బలంగా వినిపించినప్పటికీ... కేశినేని నాని విజయవాడ టీడీపీ అభ్యర్థిగా చాలా కాలం నుంచి ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఆయన పార్టీ తరపున పోటీ చేస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని టీడీపీ భావిస్తోంది.