: వారసత్వాలు, కుటుంబ చరిత్ర ఇప్పుడు పనిచేయవు: అరుణ్ జైట్లీ
రానున్న ఎన్నికల్లో వారసత్వాలు, కుటుంబ చరిత్ర పని చేయదని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ తెలిపారు. వారణాసిలో మోడీపై ప్రియాంక పోటీ చేస్తుందని వచ్చిన కథనాలపై ఆయన తన బ్లాగులో స్పందించారు. ప్రియాంక వారణాసి నుంచి పోటీ చేసినా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా గుజరాత్ లోని వడోదర నుంచి పోటీ చేసినా ఉపయోగం లేదని అన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. వ్యక్తి విఫలమైతే అదే కుటుంబంలోంచి మరో వ్యక్తిని తీసుకురావడం తప్ప కాంగ్రెస్ కు మరో మార్గం తోచదని ఆయన ఎద్దేవా చేశారు.