: బీజేపీ, మోడీ రెండూ ఒకటే: రాజ్ నాథ్ సింగ్
బీజేపీ పార్టీ, తమ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఒక్కటేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, మోడీ జనాకర్షణ గల నాయకుడని అన్నారు. మోడీ తమ పార్టీ ప్రధాని అభ్యర్థి అయినప్పుడు వివాదం ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. మోడీ నాయకత్వంలో తమ పార్టీ ప్రచారం జరుగుతోందని సీనియర్ నేత అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.