: పాకిస్థాన్ ప్రజలంతా మోడీకే ఓటేస్తారట


పాకిస్థాన్ ప్రజలంతా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకే ఓటేస్తారట. పాకిస్థాన్ ప్రజలు మోడీకి ఓటు వేయడమేంటి అని అనుకుంటున్నారా? ఇది మన దాయాది పాకిస్థాన్ కాదు. 250 మంది జనాభా ఉన్న మనలో భాగమైన పాకిస్థాన్ లోని, వంద మంది ఓటర్లు మోడీకే తమ ఓటు అంటున్నారు. బీహర్ రాష్ట్రంలోని పూర్ణియా జిల్లాలో పాకిస్థాన్ అనే గ్రామం ఉంది. పూర్ణియాలో అందరూ ఆదివాసీలే ఉన్నారు. దేశ విభజన సమయంలో గ్రామంలోని ముస్లింలంతా పాకిస్థాన్ వెళ్లిపోయారు. దీంతో ఈ ఊరిలో ఒక్క ముస్లిం కూడా లేడు.

వెళ్లిపోయిన వారికి గుర్తుగా గ్రామానికి పాకిస్థాన్ అని పేరు పెట్టుకున్నారు ఈ గ్రామస్థులు. అప్పట్నుంచి పాకిస్థాన్ గా ఈ ఊరు పిలవబడుతోంది. రెండేళ్ల క్రితం గ్రామం పేరు మారుద్దామని భావించినప్పటికీ మార్చలేదు. పాకిస్థాన్ లో విద్యావంతులు లేకపోవడం విశేషం. అంతా నిరుపేద అదివాసీలే.

  • Loading...

More Telugu News