: అంబేద్కరుకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ నేతల ఘన నివాళులు
భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 124వ జయంతి సందర్భంగా హైదరాబాదులోని ఇందిరా భవన్ లో ఆంధ్రప్రదేశ్ పీసీసీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీసీసీ సభ్యులు, కార్యకర్తలు హాజరయ్యారు.