: చిక్కడపల్లిలో ప్రచారాన్ని ప్రారంభించిన బీజేపీ అభ్యర్థి డా.లక్ష్మణ్
గ్రేటర్ హైదరాబాదులోని ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతాపార్టీ తరపున బరిలోకి దిగుతోన్న డాక్టర్ లక్ష్మణ్ ఇవాళ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకు ముందు డా. లక్ష్మణ్ చిక్కడపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని నర్సింహ బస్తీ, పాలమూరు బస్తీ, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఆయన తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.