: అమ్మాయిలా మారాలనుకున్న బీటెక్ విద్యార్థి బుక్కయ్యాడు
అమ్మాయిగా మారాలనుకున్న వ్యక్తి వ్యభిచారిగా మారాడు. ఓ వ్యక్తి నుంచి బంగారు గొలుసు కొట్టేసి పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... బెంగళూరులోని పీణ్యా సమీపంలోని మంజునాథనగర్ కు చెందిన ప్రవీణ్ అలియాస్ కాంత (23) ఇంజనీరింగ్ చేస్తున్నాడు. జన్యులోపం కారణంగా ఇతను తనని తాను అమ్మాయిలా భావించుకునేవాడు. అయితే కుటుంబంలో మాత్రం తన మగతనానికి ఏ మాత్రం తక్కువ కాకుండా దర్పం చూపించేవాడు.
ఈ క్రమంలో ఇతనికి అమ్మాయిలా మారిపోవాలనే కోరిక పెరిగిపోయింది. అలా మారిపోయేందుకు ఒక సర్జరీ కూడా చేయించుకున్నాడు. ఇంట్లోంచి రోజు ప్రవీణ్ లా బయటకు వచ్చే అతను నగరంలోని హిజ్రాలు ఉండే ప్రాంతానికి వెళ్లి చీరకట్టుకుని బయటకు వచ్చేవాడు. నిర్జన ప్రదేశాల్లో సంచరిస్తూ అక్కడ తిరిగే వారిని రెచ్చగొట్టి వారితో వ్యభిచరించి, వారి నుంచి డబ్బు గుంజుకునే వాడు. ఈ క్రమంలో ఈ నెల 6న గోరగుంటపాళ్యంకు చెందిన మురుగేష్ అనే గార్మెంట్స్ ఉద్యోగిని లైంగికంగా రెచ్చగొట్టి అతని వద్దనున్న బంగారు గొలుసు లాక్కుని పారిపోయాడు.
దీంతో మురుగేష్ పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు కాంతను అరెస్టు చేశారు. అప్పటికి అతని కుటుంబ సభ్యులకు విషయం అర్థమై మతిపోయినంత పనైంది. ప్రవీణ్ అబ్బాయని తాము భావిస్తున్నామని, కాంత రూపంలో ఉన్నాడని తెలుసుకుని హతాశులయ్యారు. అయితే మురుగేష్ లైంగిక వాంఛ తీర్చుకుని డబ్బులు లేవనడంతో అతని గొలుసు తీసుకున్నానని కాంత చెబుతున్నాడు. మురుగేష్ బంగారం గొలుసు విక్రయించగా వచ్చిన 30 వేల రూపాయలలో కొంత పెట్టి దేవుడి ఫొటోలు కొన్నానని, మిగిలిన మొత్తంతో తోటి హిజ్రాలతో కలసి జాలీగా ట్రిప్పు వేసుకొచ్చానని తెలిపాడు.