: చిరంజీవికి చెప్పకపోవడం బాధగా ఉంది: వెల్లంపల్లి శ్రీనివాస్


కాంగ్రెస్ టికెట్ దక్కిన మరుసటి రోజే ఆ పార్టీకి షాక్ ఇచ్చి బీజేపీలో చేరబోతున్న వెల్లంపల్లి శ్రీనివాస్ తన అభిప్రాయాలను వెల్లడించారు. కేవలం మోడీపై అభిమానంతోనే తాను బీజేపీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వం కనుక... సీమాంధ్ర పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలంటే బీజేపీలోనే ఉండాలని భావించినట్టు తెలిపారు. తన కార్యకర్తలు, శ్రేయోభిలాషులు కూడా బీజేపీలో చేరాలని కోరారని చెప్పారు. అయితే, చిరంజీవికి కూడా చెప్పకుండా పార్టీకి గుడ్ బై చెప్పడం కొంత బాధగా ఉందని తెలిపారు. తప్పని పరిస్థితుల్లోనే బీజేపీలో చేరుతున్నానని చెప్పారు. విజయవాడ వెస్ట్ స్థానం నుంచి బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News