: రజనీకాంత్ తో ముగిసిన నరేంద్ర మోడీ భేటీ


బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీతో రజనీకాంత్ భేటీ ముగిసింది. రజనీకాంత్ నివాసంలో సుమారు అరగంటపాటు వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా మోడీ బీజేపీకి రజనీకాంత్ మద్దతును కోరారు. సమావేశం ముగిసిన తరువాత రజనీకాంత్ మాట్లాడుతూ మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. తన ఆరోగ్యం బాగా లేనప్పుడు మోడీ తన బాగోగులు తెలుకునేవారని, అప్పుడే తన ఇంటికి రావాలని మోడీని ఆహ్వానించానని రజనీ చెప్పారు. ఈ రోజు మోడీ వచ్చి తమ ఆతిధ్యం స్వీకరించినందుకు ఆనందంగా ఉందన్నారు. మోడీ గొప్ప నాయకుడని, ఆయనకు భవిష్యత్తులో అన్నీ విజయాలే చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. పరస్పరం శ్రేయోభిలాషులం అన్న ఆయన, స్నేహపూర్వకంగానే సమావేశమయ్యామన్నారు. మోడీ వెంట తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణన్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మురళీధరరావు తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News