: డార్జిలింగ్ విభజనకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోం: మమతా బెనర్జీ
డార్జిలింగ్ విభజనకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. డార్జిలింగ్ లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీలతో ఆ ప్రాంత అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. బంద్ లకు పిలుపునిచ్చేవారిపైన ఆమె మండిపడ్డారు. బంద్ ల ద్వారా అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. అలాంటి వారు ఈ ప్రాంతం విడిచి దూరంగా వెళ్లి తమ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చన్నారు. డార్జిలింగ్ అభివృద్దే తమ ధ్యేయమన్నారు. ఇప్పటికే ఐటీఐ, ఇంజనీరింగ్ కళాశాల, విద్యుత్తు, నీటిసరఫరా తదితర పధకాలకు రాష్ట్రప్రభుత్వం ఆమోదం తెలిపిందని అన్నారు.