: వైకాపాకు పేర్ని నాని షాక్


మచిలీపట్నం వైఎస్సార్సీపీలో ముసలం పుట్టింది. మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత పేర్ని నాని ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పార్టీ కార్యకర్తలకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టే స్థోమత తనకు లేదని... అందుకే పోటీకి దూరంగా ఉండాలనుకుంటున్నట్టు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయాలని వైకాపా అధినేత జగన్ కూడా తనను కోరారని... కష్టాల్లో ఉన్నాం, పోటీ చేయలేనని జగన్ కు చెప్పినట్టు తెలిపారు. మొన్న జరిగిన జిల్లాపరిషత్, మున్సిపల్ ఎన్నికల కోసం ఓ మిత్రుడి నుంచి రూ. 1.30 కోట్ల అప్పు తీసుకొచ్చానని, ఇంటిని తాకట్టు పెట్టి రూ. 70 లక్షలు తెచ్చానని పేర్ని నాని తెలిపారు. తన తల్లి అనారోగ్యానికి గురైతే ఆసుపత్రిలో చేర్పించామని, ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని చెప్పారు.

  • Loading...

More Telugu News