: తమ వారసులకు కాంగ్రెస్ నేతలు టికెట్లు ఇప్పించుకున్న సంగతి చెప్పరా?: హరీష్ రావు


టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కుటుంబ పాలన వస్తుందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. ఎంతో మంది కాంగ్రెస్ నేతలు తమ వారసులకు టికెట్లు ఇప్పించుకున్నారని తెలిపారు. తమ వారసులకు వారసత్వంగా టికెట్లను ఇచ్చిన సంగతిని కాంగ్రెస్ నేతలు ఎందుకు చెప్పుకోవడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టిందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News