: మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్థిగానే మల్ రెడ్డి


తెలంగాణలో నామినేషన్ల ఉహసంహరణ గడువు ముగిసింది. అయినా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మాత్రం మల్ రెడ్డి రంగారెడ్డి తన నామినేషన్ ను ఉపసంహరించుకోలేదు. పొత్తులో భాగంగా సీపీఐకి ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. అయితే, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్టుబట్టి మరీ మల్ రెడ్డితో నామినేషన్ దాఖలు చేయించారు.

తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తదితరులు ఆయనకు షరతులతో కూడిన బీఫారం ఇచ్చి, అధికారిక కాంగ్రెస్ అభ్యర్థిగా చేసేశారు. తర్వాత సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణతో చర్చలు జరిపిన తర్వాత మల్ రెడ్డిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని కోరినా, ఆయన నిరాకరించారు. బీఫారం చేతిలో ఉండటంతో ఆయన ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీలో ఉన్నట్లయింది. సీపీఐ అభ్యర్థి ఇప్పుడు ఇతర పార్టీల అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డితో కూడా పోటీ పడాల్సి వస్తోంది.

  • Loading...

More Telugu News