: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు


సీమాంధ్రలో పలు నియోజకవర్గాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. సీమాంధ్రలోని 25 లోక్ సభ, 175 శాసనసభ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడటంతో ఈ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 19వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేసేందుకు అవకాశం ఉంది.

వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట శాసనసభ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా అమరనాథరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి తరపున ఆయన తనయుడు అభినయరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కర్నూలు జిల్లా పత్తికొండ అసెంబ్లీకి కోట్ల హరిచక్రపాణిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

నెల్లూరు సిటీ అసెంబ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ వేశారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానానికి దొరబాబు, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తోట గోపీ, ఉండి అసెంబ్లీ స్థానానికి పాతపాణి సర్రాజు నామినేషన్ దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News