: నటుడు అక్షయ్ కుమార్ కు సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ ఛాన్స్!
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు ఓ పార్టీ టికెట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చిందట. అయితే, అక్కీ మాత్రం ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాడట. తాజాగా ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు. 'అవును ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాకు అవకాశం వచ్చింది. అయితే, ఆ పార్టీ పేరును మాత్రం వెల్లడించను' అని తెలిపాడు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీయే ఈ ఛాన్స్ ఇచ్చారని సమాచారం.