: తమిళనాట ఆంధ్ర మత్స్యకారుల ఆగ్రహం


తమిళనాట ఆంధ్ర మత్స్యకారులు వీరంగం వేస్తున్నారు. స్థానిక మత్స్యకారులను చావబాదేందుకు 16 గ్రామాలకు చెందిన మత్స్యకారులు పడవల్లో బయల్దేరి వెళ్లారు. దీంతో తమిళనాడు, ఆంధ్రా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమిళనాడులోని చినమాంగోడు గ్రామస్థులపై నొచ్చికుప్పానికి చెందిన గ్రామస్థులు దాడి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తిరువళ్లూరు అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు.

గ్రామస్థుల దాడిలో మూడు జీపులు ధ్వంసమయ్యాయి. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు. అయినప్పటికీ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా ఉంది. ఘర్షణ వివరాల్లోకి వెళ్తే...రెండు రోజుల క్రితం నొచ్చికుప్పం గ్రామానికి చెందిన మత్స్యకారులపై తమిళనాడుకు చెందిన మత్స్యకారులు దాడి చేయడం ఘర్షణకు దారితీసింది.

దాడిలో గాయపడిన వారు ఆంధ్రమత్స్యకార సంఘంలో సభ్యులుగా ఉన్నారు. దీంతో ఈ రోజు ఉదయం నెల్లూరు జిల్లా తడ ప్రాంతంలోని 16 గ్రామాల మత్స్యకారులు తమిళనాడు జాలర్లపై దాడి చేసేందుకు వెళ్లారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో అడ్డువచ్చిన అధికారులను ఇరగదీశారు. దీంతో తమిళనాడు సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

  • Loading...

More Telugu News