: ఏ కేన్సర్ కైనా .. ఇక ఒకటే మందు!
మానవాళికి అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో కేన్సర్ ఒకటి. ప్రాథమిక దశల్లో గుర్తిస్తే సులువుగా నివారించగలిగే ఈ మహమ్మారి.. ముదిరిందంటే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. కేన్సర్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. రొమ్ము కేన్సర్, బ్రెయిన్ కేన్సర్, బోన్ కేన్సర్, గర్భాశయ కేన్సర్, ప్రోస్టేట్ కేన్సర్.. ఇలా ఎన్నో. ఇప్పటి వరకు వైద్యులు ఒక్కో రకం కేన్సర్ చికిత్సకు వేర్వేరు ఔషధాలు ఉపయోగించేవాళ్ళు.
అయితే, స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు ఓ నూతన ఔషధాన్ని ఆవిష్కరించారు. ఇది అన్ని రకాల కేన్సర్లను రూపుమాపడంలో దివ్యంగా పనిచేస్తుందని వారు అంటున్నారు. కేన్సర్ లో కణుతులు ఏర్పడే దశలోనూ ఈ మందు భేషుగ్గా పనిచేస్తుందని స్టాన్ ఫోర్ట్ వర్శిటీ పరిశోధకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కణితి పెరుగుదలను గణనీయంగా నియంత్రించడంలో తాజా ఔషధం పనితీరు సంతృప్తికరంగా ఉందని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న ఇర్విన్ వీస్ మన్ వెల్లడించారు.