: తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధిగా శ్రవణ్ నియామకం


కాంగ్రెస్ లో చేరిన కొద్ది నిమిషాలకే దాసోజు శ్రవణ్ ను తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధిగా పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నియమించారు. ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ, తెలంగాణ లక్ష్యం నెరవేరిందన్నారు. కుటుంబ పాలన, నియంతృత్వ ధోరణి పోవాలన్నారు. తెలంగాణ బిల్లుకోసం కాంగ్రెస్ పడ్డ తపన అంతా ఇంతా కాదని, సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పెద్దపీట వేసిందని ప్రశంసించారు.

  • Loading...

More Telugu News