: భారత్ నుంచి పాకిస్తాన్ నేర్చుకోకపోతే కష్టమే: మొయిన్ ఖాన్
దూరదృష్టి, కచ్చితమైన ప్రణాళికలు ప్రపంచ క్రికెట్లో భారత్ (బీసీసీఐ)ను అగ్రపీఠానికి చేర్చాయని పాకిస్థాన్ కోచ్ మొయిన్ ఖాన్ అన్నాడు. అత్యంత శక్తిమంతంగా మారిన బీసీసీఐ నుంచి పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ కొంతైనా గ్రహించి, ఆచరణలో పెట్టకపోతే... ఐసీసీ స్థాయిలో ఏ కోణంలోనూ భారత్ తో పాకిస్థాన్ పోటీపడలేదని అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ అద్భుత ప్రణాళిక, భారత ఆటగాళ్ల మానసిక స్థైర్యం బీసీసీఐను, టీంఇండియాను అగ్రస్థానానికి తీసుకెళ్లిందని చెప్పాడు.
ఐపీఎల్ లో ఎంతో పోటీని భారత ఆటగాళ్లు తట్టుకుని నిలబడుతున్నారని... వారిలో అత్యున్నత ప్రతిభ కనబరచినవారు టీంఇండియా జట్టులో స్థానం సంపాదిస్తున్నారని... అందుకే భారత్ అద్భుతమైన ఆట తీరుతో విజయాలను సాధిస్తోందని చెప్పాడు. ఇప్పటికైనా పాకిస్థాన్ కూడా సొంతంగా సూపర్ లీగ్ టీ20ని ప్రారంభించాలని అనుకోవడం సంతోషదాయకం అని మొయిన్ చెప్పాడు.