: దేశం ఆనందంగా ఉండాలంటే వెళ్లి ఓటేయండి: షారూక్
ఆనందకరమైన దేశంలో ఉండాలనుకుంటున్నారా? అయితే వెళ్లి పోలింగ్ రోజున తప్పనిసరిగా ఓటేయండి అంటూ బాలీవుడ్ ప్రముఖ నటుడు షారూక్ ఖాన్ తన అభిమానులకు సూచించాడు. 'మనం సంతోషకరమైన దేశంలో ఉండాలనుకంటాం. నాకు తెలిసినంతవరకు ప్రజలు చాలా తెలివైనవారు. ఎవరికి ఓటేయాలన్నది వారికి తెలుసు' అని చెప్పారు. ఎస్పీ అధినేత ములాయం, ఆ పార్టీ నేత అబు అజ్మి వివాదాస్పద వ్యాఖ్యలపై మాట్లాడాలని విలేకరులు కోరగా... ఎన్నికల సమయంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడతారని, కానీ ప్రతీ ఓటరు కోరుకున్న నేతకు వెళ్లి ఓటేయాలని మాత్రమే తాను కోరగలనన్నారు. తాను 'హ్యాపీ న్యూఇయర్' సినిమా కోసం వారంలో అన్ని రోజులూ పనిచేస్తున్నానని, కనుక ఈ ఏడాది ఐఐఎఫ్ఏ అవార్డుల కార్యక్రమానికి వెళ్లడంలేదని షారూక్ తెలిపారు. ఈ సిినిమా ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల అవుతుందని అంచనా.