: 40 పడవలు, 500 మంది... దాడులకు బయల్దేరిన ఆంధ్ర మత్స్యకారులు


తమిళనాడు మత్స్యకారులపై దాడి చేసేందుకు ఆంధ్ర మత్స్యకారులు 500 మంది 40 పడవల్లో బయలుదేరి వెళ్లారు. తమిళనాడులోని చిన్న మాంగోడు, పెద్ద మాంగోడు, కీరపాలెం మత్స్యకార గ్రామాలపై దాడి చేసేందుకు నెల్లూరు జిల్లా తడ మండలానికి చెందిన 16 గ్రామాల మత్స్యకారులు వెళ్లారు. పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకున్న పోలీసులు వారిని వారించారు. అయినప్పటికీ వారు ఖాతరు చేయకుండా వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో, పోలీసులు 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. 500 మంది ఆంధ్ర మత్స్యకారులు వస్తున్నారన్న వార్త తెలుసుకున్న తమిళనాడు పోలీసులు పెద్దమాంగోడు వద్ద భారీ సంఖ్యలో మోహరించారు.

యుద్ధాన్ని తలపిస్తున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే, రెండు రోజుల క్రితం తమిళనాడులోని ఆంధ్ర మత్స్యకారుల సంఘంతో కలసి ఉన్న నొచ్చికుప్పానికి చెందిన ఆరుగురు మత్స్యకారులపై తమిళనాడు జాలర్లు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న ఆంధ్ర మత్స్యకారులు ప్రతీకారం తీర్చుకునేందుకు బయల్దేరారు.

  • Loading...

More Telugu News