: అందుకే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీని అల్లా శిక్షించాడు: అజంఖాన్
ఉత్తరప్రదేశ్ మంత్రి అజంఖాన్ మరోసారి నోటికి పని చెప్పారు. ఇప్పటికే పలు మార్లు వివాదాస్పద, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విమర్శలకు గురైనా ఆయన తన తీరును మార్చుకోలేదు. 'రాజీవ్ గాంధీ బాబ్రీమసీదు గేట్లు తెరవాలని ఆదేశించారు. సంజయ్ గాంధీ బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిపించారు. వారిద్దరినీ అల్లా శిక్షించాడు. అలాగే, ఇందిరాగాంధీ గోల్డెన్ టెంపుల్ కు బుల్డోజర్లను పంపించారు. ఫలితం ఏమైంది? వారి కుటుంబమంతా ఖతం అయిపోయింది' అని అజంఖాన్ వ్యాఖ్యానించారు.