: రీపోలింగ్ జరిగే స్థానాలు ఇవే


స్థానిక సంస్థలకు జరిగిన తుది విడత ఎన్నికల్లో అక్కడక్కడ పోలింగ్ ప్రక్రియకు విఘాతం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కొన్ని చోట్ల రీపోలింగ్ నిర్వహించనుంది. అనంతపురం జిల్లా బండ్లవీధిపల్లి, విజయనగరం జిల్లా రావివలస, నెల్లూరు జిల్లా కలువాయి, మెదక్ జిల్లా వెల్దుర్తిలలో ఈనెల 13న రీపోలింగ్ జరుగుతుంది. విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టులో ఈ నెల 16న రీపోలింగ్ నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News