: ఫలితాలు వెలువడేంతవరకు కోడ్ అమల్లో ఉంటుంది: రమాకాంత్ రెడ్డి
చిన్న చిన్న ఘటనలు మినహా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగియని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు. మలి విడత ఎన్నికల్లో 80 శాతం వరకు పోలింగ్ నమోదైందని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ముగిసే లోపు మొత్తం పోలింగ్ శాతం 85 శాతం వరకు ఉంటుందని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో కొన్ని చోట్ల రీపోలింగ్ జరుపుతామని చెప్పారు.