: ఆరోగ్య శ్రీ కి 1600కోట్లు : కొండ్రు
ఆరోగ్యశ్రీ పథకానికి ఈ ఏడాది బడ్జెట్లో 1600 కోట్లు కేటాయించామని మంత్రి కొండ్రు మురళి చెప్పారు. శ్రీకాకుళంలోని జీఎంఆర్ కేర్ ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్యసేవలను ఆయన ఇవాళ ప్రారంభించారు. ఉగాది నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయిస్ కు హెల్త్ కార్డులు పంపిణీ చేస్తామని మురళి వెల్లడించారు. ఇందుకోసం 250 కోట్లు ఖర్చుచేస్తున్నామన్నారు. తద్వారా రాష్ట్రంలోని 25 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని మంత్రి తెలిపారు.