: అరగంట స్తంభించిన ఢిల్లీ మెట్రో రైలు


ఢిల్లీ మెట్రో రైలు ఆగింది. దేశ రాజధాని ట్రాఫిక్ అవస్థలు తీర్చే మెట్రో రైలులో మంటలు చెలరేగాయంటూ కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో మెట్రో రైలు సర్వీసులు నిలిచిపోయాయి. అర్జన్ ఘడ్-షితోర్ని మధ్య నడిచే జహంగీర్ పురి నుంచి హుడా సిటీ సెంటర్ మధ్య ప్రాంతంలో ఉండగా... మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో... మెట్రో రైలు చివరి బోగీలో కొంత మంది ప్రయాణికులు నిప్పు రవ్వలు, పొగ చూశారు.

వెంటనే వారు డ్రైవర్ కు సమాచారమందించారు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ అత్యవసర బ్రేకులు వాడి రైలు నిలిపేసి తనిఖీలు నిర్వహించారు. మంటలు లేవని, నిప్పు నెరసులు మాత్రం కనిపించాయని అధికారులు నిర్ధారించారు. ప్రయాణికులకు, రైలుకు ఎలాంటి నష్టం జరగలేదని వారు స్పష్టం చేశారు. తదుపరి పరీక్షల నిమిత్తం రైలును అరగంట పాటు నిలిపేశారు. దీంతో అరగంట పాటు ఈ ట్రాక్ మీదుగా వెళ్లే సర్వీసులు స్తంభించాయి.

  • Loading...

More Telugu News