: దేశం మొత్తం తప్పంటే... తండ్రిని సమర్థించిన అఖిలేష్ యాదవ్
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అన్న చందాన ఉంది సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, అతని కుమారుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ల తీరు. దేశం మొత్తం ములాయం సింగ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై దుమ్మెత్తిపోస్తుంటే తండ్రిని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశాడు అఖిలేష్. లక్నోలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, తప్పంతా మీడియాదేనని అన్నాడు. తన తండ్రి వ్యాఖ్యలను మీడియా తప్పుగా చిత్రీకరించిందని మండిపడ్డారు. తన తండ్రి 'అత్యాచారం కేసుల్లో ఏకంగా ఉరిశిక్ష విధించడం అవసరమా? వాళ్లు పిల్లలు.. తప్పులు చేస్తుంటారు' అని అన్నారని అన్నారు.