: మల్ రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకోవాలి: పొన్నాల


కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మల్ రెడ్డి తన నామినేషన్ ను ఉపసంహరించుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కోరారు. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే అని చెప్పారు. ఇంతకు ముందు మల్ రెడ్డికి ఇచ్చిన బీఫాం షరతులతో కూడినదని తెలిపారు. సీపీఐతో పొత్తులో భాగంగా కొంత మంది కాంగ్రెస్ నేతలు సీట్లను కోల్పోవడం బాధాకరమే అయినప్పటికీ... తప్పదని అన్నారు. రెబెల్స్ గా నామినేషన్లు వేసిన వారు ఈ విషయాన్ని అర్థం చేసుకుని వారి నామినేషన్లను ఉపసంహరించుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News